మర్యాదగా నా ఫోటోలను డిలీట్‌ చేయండి: హీరోయిన్‌ వార్నింగ్‌

Published on Wed, 09/03/2025 - 11:05

అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్న ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లకు హీరోయిన్‌ సోనాక్షి సిన్హా గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. వెంటనే వాటిని డిలీట్‌ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సోనాక్షి.. కొన్ని బ్రాండెడ్‌ వెబ్‌సైట్లలో తన ఫోటోలను చూసి ఆశ్చర్యపోయానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

‘నేను ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే షాపింగ్‌ చేస్తుంటాను. ఒక నటిగా కొత్త కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తుంటాను.అలాంటప్పుడు ఆ డ్రెస్‌ వివరాలు దాని బ్రాండ్‌కు క్రెడిట్‌ ఇస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను. అంతమాత్రనా నా ఫోటోలను మీ వెబ్‌సైట్లలో వాడుకోవడం ఎంతవరకు ఆమోదయోగ్యం? నన్ను సంప్రదించకుండా, నా అనుమతి లేకుండా నా ఫోటోలను ఎలా ఉపయోగించుకుంటారు? నైతిక బాధ్యత వహించరా? ఇలా చేయడం సరైన పద్దతి కాదు. నేను మీ వివరాలను వెల్లడించకముందే నా ఫోటోలను తొలగించండి. లేదంటే.. చట్టపరమైన చర్యలు తప్పవు’ అని సోనాక్షి వార్నింగ్‌ ఇచ్చింది. గతంలో అనుష్క శర్మ, అమితాబ్‌ బచ్చన్‌ కూడా అనుమతి లేకుండా పలు కంపెనీలు తమ ఫోటోలను ఉపయోగించడాన్ని విమర్శించారు.

సోనాక్షి కెరీర్‌ విషయానికొస్తే.. ఆ మధ్య ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘నికితా రాయ్‌’ ఇటీవల రిలీజై మంచి టాక్‌ని సంపాదించుకుంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)