Breaking News

తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ

Published on Sat, 03/08/2025 - 14:43

బాలీవుడ్‌ హీరోయిన్లు టాలీవుడ్‌పై మనసు పారేసుకున్నారు. వరుసగా స్టార్‌ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కల్కి 2989 ఏడీ సినిమాతో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీ కపూర్‌, లైగర్‌తో అనన్య పాండే.. ఇలా అక్కడి బ్యూటీలందరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా సోనాక్షి సిన్హ (Sonakshi Sinha) సైతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

మహిళా దినోత్సవం సందర్భంగా..
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమా (Jatadhara Movie)లో ముఖ్య పాత్రలో నటిస్తోంది. నేడు (మార్చి 8న) మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఆగ్రహంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీకి వెంకట్‌ కళ్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యంలో..
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై శివివన్‌ నారంగ్, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతోన్నారు.  ఈ సినిమా కోసం బాడీని పెంచే పనిలో ఉన్న సుధీర్‌బాబు అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు.

 

 

చదవండి: అది కూడా తప్పేనా? నాకు స్టార్‌గా ఉండాలని లేదు: అక్షయ్‌ కుమార్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)