Breaking News

జుట్టు పీక్కునేంతలా మామధ్య గొడవలు: సోనాక్షి

Published on Sat, 12/06/2025 - 12:37

ఈరోజుల్లో ప్రేమపెళ్లి అనేది కామన్‌. కానీ భిన్న వర్గాలవారు పెళ్లి చేసుకుంటేనే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హ అలాంటి ట్రోలింగ్‌ బారిన పడింది. ఈమె జహీర్‌ ఇక్బాల్‌ను ప్రేమించి పెళ్లాడింది. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే తమ లవ్‌స్టోరీలో కూడా చాలా గొడవలు జరిగాయంటోంది.

గొడవలు
సోనాక్షి మాట్లాడుతూ.. మేము మూడేళ్లపాటు ప్రేమలో ఉన్నాక మామధ్య చాలా గొడవలు జరిగాయి. ఎంతలా అంటే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని పీక్కునేంతలా! అసలు ఒకరి ఆలోచనలను మరొకరం అర్థం చేసుకోలేకపోయాం. అలా అని విడిపోవాలనుకోలేదు. దీన్ని పరిష్కరించుకోవాలనుకున్నాం. 

నెగెటివ్‌గా చూడొద్దని..
కపుల్స్‌ థెరపీకి వెళ్దామని జహీర్‌ ఐడియా ఇచ్చాడు. ఈ ఆలోచనేదో బాగుందనిపించింది. రెండు సిట్టింగ్స్‌లోనే మా మధ్య గొడవలు పరిష్కారమయ్యాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ప్రతీది నెగెటివ్‌గా చూడకూడదని తెలుసుకున్నాం అని చెప్పుకొచ్చింది. అలా ఏడేళ్లు ప్రేమలో మునిగి తేలిన సోనాక్షి (Sonakshi Sinha), జహీర్‌ 2024 జూన్‌ 23న పెళ్లి చేసుకున్నారు. ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు. 

సల్మాన్‌ పార్టీలో తొలిసారి..
ఇకపోతే వీరిద్దరూ డబుల్‌ XL (2022) అనే మూవీలో నటించారు. అంతకంటే ముందు వీరు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ చేసిన పార్టీలో కలిశారు. తర్వాత 2017లో ట్యూబ్‌లైట్‌ ప్రీమియర్‌లో మరోసారి కలుసుకున్నారు. అప్పుడే సరదాగా ఐదుగంటల పాటు మాట్లాడుకున్నారు. అప్పుడే ఈ బంధం ఏదో స్పెషల్‌గా ఉందని సోనాక్షికి అర్థమైంది. తర్వాత అదే నిజమై వైవాహిక బంధంగా మారింది. సోనాక్షి చివరగా జటాధర అనే తెలుగు మూవీలో నటించింది.

చదవండి: పవన్‌ కల్యాణ్‌.. బిగ్‌బాస్‌ చరిత్ర తిరగరాయనున్నాడా?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)