తెలుగు ఇండస్ట్రీని చూసి నేర్చుకోండి: సోనాక్షి

Published on Wed, 11/05/2025 - 12:07

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. సోనాక్షి రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నవంబర్‌ 7న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు పరిశ్రమలో పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంది.

దక్షిణాది సినీ‌ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్‌ కొన్ని విషయాలు నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా అభిప్రాయం వ్యక్తం చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమలో సమయపాలన పాటిస్తారని తెలిపింది. తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వస్తే సాయంత్రం ఆరు వరకే ఉంటుందని.. ఈ విషయంలో వారిని అభినందించాల్సిందేనని అన్నారు. వారిని చూసి బాలీవుడ్‌ మేకర్స్  నేర్చుకోవాలని హితవు పలికింది.  బాలీవుడ్‌లో  అర్ధరాత్రి వరకు షూటింగ్స్ జరుగుతుంటాయని విమర్శించింది. సౌత్‌లా చేయాలంటే క్రమశిక్షణ అవసరమని సోనాక్షి వెల్లడించింది. తెలుగు చిత్ర పరిశ్రమను చూసైనా బాలీవుడ్ మారాలని సలహా ఇచ్చింది.

తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..' స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. గతంలో నేను (లింగా) ఒక తమిళ సినిమా చేశా.  ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చేశా.  ఎల్లప్పుడూ ఇలాంటి చిత్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ అంతకు ముందు నా షెడ్యూల్‌ కుదరక సినిమాలు ఒప్పుకోలేదు' అని చెప్పింది

ఆ తర్వాత వర్క్ లైఫ్ ప్రస్తావిస్తూ..' హిందీ, తెలుగు సినిమా పని సంస్కృతిని పోల్చి చూస్తే.. దక్షిణది పరిశ్రమలో సమయపాలన గ్రేట్. అక్కడ పని, లైఫ్‌ బ్యాలెన్స్ చాలా బాగుంది. ఈ విషయాన్ని వారి నుంచి మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సెట్‌లోని క్రమశిక్షణ తనకు ప్రత్యేకంగా అనిపించింది. ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వెళ్తే.. ఆరు గంటల తర్వాత అస్సలు షూట్ చేయరు. అది నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణను అంగీకరించాల్సిన విషయం' అని తెలిపింది. కాగా.. జటాధర మూవీలో ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)