Breaking News

విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి

Published on Thu, 04/17/2025 - 16:10

సోనాక్షి సిన్హ (Sonakshi Sinha)- జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal).. ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఈ సంతోషాన్ని చూసి కొందరు జనాలకు కళ్లు మండుతున్నాయి. కులమతాలకు అతీతమైనది ప్రేమ అని వీరు చాటి చెప్తుంటే వాళ్ల కడుపు మండిపోతోంది. ఆ కడుపు మంట చల్లార్చుకునేందుకు వీరి కాపురంలో నిప్పులు పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీళ్లు విడిపోవాలని ఎదురుచూస్తున్నారు. ఏ పోస్టు పెట్టినా విడాకుల గురించే కామెంట్లు చేస్తున్నారు. 

కచ్చితంగా విడాకులు తీసుకుంటాం
తాజాగా ఆమె పోస్ట్‌ కింద ఓ వ్యక్తి మీరు విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే ఉంది అని శపించాడు. అది చూసిన సోనాక్షికి సహనం చచ్చిపోయింది. అవునా.. ముందు మీ అమ్మానాన్నకు విడాకులు అవనీ.. తర్వాత కచ్చితంగా మేము తీసుకుంటాం. ఒట్టు అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. అది చూసిన జనాలు.. ఇలాంటివాళ్లకు ఇలాగే గడ్డిపెట్టాలని సోనాక్షిని సపోర్ట్‌ చేస్తున్నారు. సోనాక్షి, జహీర్‌ ఇక్బాల్‌ ఏడేళ్లపాటు ప్రేమించుకున్నారు. 23 జూన్‌, 2024న పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి వీరిపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. 

ట్రోలింగ్‌పై హీరోయిన్‌ తండ్రి ఫైర్‌
దీనిపై సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హ స్పందిస్తూ.. పనీపాటా లేక ఖాళీగా తిరుగుతున్న అందరికీ ఇదొక్కటే పనుంది. నా కూతురు రాజ్యాంగవిరుద్ధంగా, చట్టాన్ని అతిక్రమించే విధంగా ఏ తప్పూ చేయలేదే? పెళ్లనేది ఇద్దరు వ్యక్తులు తీసుకునే నిర్ణయం. వారి మధ్యలోకి దూరేందుకు ఎవరికీ అర్హత లేదు. వాళ్లను విమర్శించేవాళ్లకు నేనొక్కటే చెప్పదల్చుకున్నా.. వెళ్లి మీ పని చూసుకోండి.. మీ జీవితాన్ని ముందు చక్కదిద్దుకోండి అని చెప్పుకొచ్చాడు.

చదవండి: రాజ్‌తరుణ్‌ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)