Breaking News

క్రేజీ కాంబినేషన్స్‌... పదేళ్ల తర్వాత మళ్లీ ఇలా..

Published on Mon, 02/27/2023 - 02:14

ఓ సినిమా సూపర్‌హిట్‌ అయితే ఆ హీరో, డైరెక్టర్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కావాలని ఆడియన్స్‌ కోరుకుంటుంటారు. కానీ సరైన కథ కుదిరితేనే ఆ కాంబో రిపీట్‌ అవుతుంది. అలా మంచి కథ కుదరడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లో రిపీట్‌ అవుతున్న కొన్ని కాంబినేషన్స్‌పై (హీరో–డైరెక్టర్‌) ఓ లుక్కేద్దాం. 

  హీరో మహేశ్‌ బాబు ముచ్చటగా మూడోసారి  దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘అతడు’ సినిమా కోసం మహేశ్, త్రివిక్రమ్‌  తొలిసారి చేతులు కలిపారు. ఆ మూవీ హిట్‌ తర్వాత  వీరిద్దరి కాంబినేషన్‌లో 2010లో ‘ఖలేజా’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్‌ కలయికలో రూ΄పొందుతున్న సినిమా సెట్స్‌పైన ఉంది.

హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌. ఇప్పటికే కొంత షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ వారంలోనే హైదరాబాద్‌లోప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుతో పాటు పూజాహెగ్డే, శ్రీలీల పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్‌. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటోంది చిత్రయూనిట్‌.

   హీరో అల్లు అర్జున్‌తో ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) వంటి ప్రేమకథా చిత్రాలు తీశారు దర్శకుడు సుకుమార్‌. పది సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప’ రూ΄పొందుతోంది. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్‌. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తోంది.
‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్‌’  2021 డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయం సాధించింది. దీంతో మలిపార్టు ‘పుష్ప: ది రూల్‌’పై మరింత ఫోకస్‌ పెట్టారు అల్లు అర్జున్‌ అండ్‌ సుకుమార్‌. ఆల్రెడీ ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌ మొదలైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మార్చి  మొదటివారంలోప్రారంభం  కానున్నట్లు తెలిసింది. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2024లో రిలీజ్‌ కానున్నట్లు తెలిసింది. 

 పదిహేను సంత్సరాల క్రితం వచ్చిన ‘ఢీ: కొట్టిచూడు’(2007) సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేసింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లోని మరో సినిమా ప్రకటన రావడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ‘ఢీ: కొట్టిచూడు’  సినిమాకు సీక్వెల్‌గా ‘ఢీ2: డబుల్‌ డోస్‌’ సినిమా రూ΄పొందనున్నట్లు 2020 నవంబరులో ప్రకటించారు మంచు విష్ణు.
అయితే ఈ సినిమాపై మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది. మరోవైపు గోపీచంద్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. మరి.. ఆయన  దర్శకత్వంలో ఏ హీరో సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళుతుందో తెలియాలంటే  కొద్దిరోజులు వేచి చూడాలి. 

  ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రాల్లో 2009లో వచ్చిన హారర్‌ ఫిల్మ్‌ ‘ఈరమ్‌’ మంచి హిట్‌ సాధించింది. అరివళగన్‌ ఈ  సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘వైశాలి’గా 2011లో విడుదలై సక్సెస్‌ సాధించింది. పద్నాలుగేళ్ల తర్వాత ఆది, అరివళగన్‌ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే చిత్రం రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. లక్ష్మీమీనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్‌  చేయాలనుకుంటున్నారు. కాగా పదేళ్ల గ్యాప్‌ తర్వాత రిపీట్‌  అవుతున్న హీరో,  డైరెక్టర్‌ కాంబినేషన్‌ జాబితాలో మరికొన్ని తెలుగు చిత్రాలు ఉన్నాయి.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)