Breaking News

పాకిస్తాన్‌లో అలాంటివేవి లేవు.. ‘దురంధర్‌’పై హిలేరియస్‌ రివ్యూ

Published on Tue, 12/09/2025 - 15:12

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్‌ నిర్మించిన సినిమా ‘దురంధర్‌’ విడుదలై రోజులు గడుస్తోంది. పాకిస్థాన్‌లో ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఓ భారతీయ ఐబీ అధికారి చేసిన ప్రయత్నమే ఈ దురంధర్‌(Dhurandhar Movie) కథ. సినిమాపై పబ్లిక్‌ టాక్‌ భిన్నంగా ఉన్నప్పటికీ అదేదో బలూచిస్తాన్‌ పాటకు అక్షయ్‌ ఖన్నా చేసిన డ్యాన్స్‌పై మాత్రం ఇంటర్నెట్‌ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌పై రకరకాల రీళ్లూ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌  రివ్యూ చేశాడు. దురంధర్‌ సినిమా చూసిన పాకిస్థాన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడన్నది ఈ రివ్యూ సారాంశం... ఇంతకీ అతగాడు ఏమంటాడంటే...

‘‘అయ్యా... దురంధర్‌ సినిమా ఇప్పుడే చూశా. బాబులూ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. సినిమాలో మీరు చూపించినవి ఏవీ పాకిస్థాన్‌లో లేవు. ఒకొక్కటి.. ప్రతి ఒక్కటీ అబద్ధం. అందులో రణ్‌వీర్‌ సింగ్‌ ఓ మోటర్‌ సైకిల్‌ నడుపుతూంటాడు. అలాంటిది పాకిస్థాన్‌ మొత్తమ్మీద లేదంటే నమ్మండి. నాయనలారా! ఇంత అత్యాచారాలకు పాల్పడకండి సారూ. స్పె‍్లండర్‌ బైక్‌నే సూపర్‌ బైక్‌ అనుకునే రకాలం మేము. అట్లాంటిది.. మీరు ఆ సినిమాలో ఏమేమో చూపించేశారు. 

కరాచీలో అండర్‌పాస్‌ ఉన్నట్లు చూపారు. ఊహూ... ఎక్కడా అలాంటిది లేదయ్యా.. మాకున్న అండర్‌పాస్‌లు అన్నీ భారత్‌ సరిహద్దుల్లోనే.. అది కూడా ఉగ్రవాదులను ఇటు నుంచి అటుకు పంపేందుకు మాత్రమే. అయ్యో... స్క్రిప్ట్‌లో లేని విషయమూ చెప్పేశానే. కొంచెం మరచిపోండేం! మిగిలిన విషయాలంటారా?... మేజర్‌ ఇక్బాల్‌, రెహ్మాన్‌ డెకాయిట్‌, 26/11... వంటివేవీ మేము చేయలేదు. ఒట్టు. ఏంటి అవన్నీ నిజమే అంటావా? లేదు సారు.. అవన్నీ పచ్చి అబద్ధాలు.’’

కోనసీమ వెటకారానికి మించిన హిలేరియస్‌ రివ్యూ ఇది. మీరూ ఒకసారి చూసేయండి మరి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)