Breaking News

స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో శోభితకు ఛాన్స్‌

Published on Mon, 05/19/2025 - 11:05

నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు  నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్‌ మోడల్‌గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్‌ రాఘవన్‌ 2.0 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్‌ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. 

అదేవిధంగా హాలీవుడ్‌లో మంకీ మాన్‌ చిత్రంలో నటించి పాన్‌ వరల్డ్‌ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా.రంజిత్‌ ఇటీవల విక్రమ్‌ కథానాయకుడుగా తంగలాన్‌ చిత్రం చేశారు. తాజాగా వట్టువన్‌ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

గోల్డెన్‌ రేష్మియా ఫిలిమ్స్‌తో కలిసి నీలం స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్‌ కథానాయకుడుగా, ఆర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్‌ స్టర్స్‌ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)