రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!
Breaking News
మన శత్రువులు ఎవరో కాదు.. వాళ్లే: శోభితా ఆసక్తికర పోస్ట్
Published on Thu, 09/17/2026 - 15:39
అక్కినేని కోడలు, నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాల ఆసక్తికర కామెంట్స్ చేసింది. మనం ఎదగాలని కోరుకునే వాళ్లు చాలా తక్కువగా ఉంటారని పేర్కొంది. ముఖ్యంగా మహిళల పట్ల ఎప్పుడు చిన్నచూపు ఉంటుందని రాసుకొచ్చింది. ఏదైనా సాధించాలనుకునే వారికి ఎవరు సహకరించరని తెలిపింది. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ వీడియోను శోభితా ఈ విధంగా స్పందించింది. అందుకే తాను 16 ఏళ్ల వయసులో తాను ఇంటిని విడిచి ముంబయికి వెళ్లిపోయానని పేర్కొంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ వీడియోను షేర్ చేసింది. మనం ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తే మనవాళ్లే మనకు వ్యతిరేకంగా మాట్లాడాతారని ఆ వీడియో తెలిపింది. కొత్తగా ఏదైనా ప్రయత్నించేవారికి ఎల్లప్పుడూ అదే మద్దతు అందించరని మాట్లాడింది. ఒక తెలుగు వ్యక్తికి ఉన్న శత్రువు మరో తెలుగు వ్యక్తేనని..ఇది నిజంగా చాలా విచారకరమని పేర్కొంది. ఇది చూసిన శోభిత తమ సొంత అనుకున్న వాళ్లే మనకు శత్రువులు అవుతారంటూ ఆ పోస్ట్‌కు శోభితా మద్దతు పలికింది.
శోభితా మాట్లాడుతూ..' తాను 16 ఏళ్ల వయసులో ఉండగా నా బ్యాగులు సర్దుకుని ముంబయికి బయలుదేరా. విజయం సాధిస్తాననే గ్యారెంటీ ఏమీ లేదు. కానీ నేను నా అదృష్టాన్ని పరీక్షించుకున్నా. ఎందుకంటే కలలు కనడానికి సాహసించే వారి పట్ల, ముఖ్యంగా మీరు ఏ రంగంలోకి ప్రవేశించాలనుకున్నా ఇక్కడి వాతావరణం మనకు అనుకూలంగా ఉండదని తెలుసు. మరి ముఖ్యంగా ఒక మహిళకు అయితే ఈ వ్యతిరేకత మరింత రెట్టింపుగా ఉంటుంది' అని తెలిపింది.

అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ పరిస్థితి మారి ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే శోభితా చీకటిలో అనే మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఇందులో శోభిత సరసన విశ్వదేవ్ రాచకొండ నటించారు. కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మించారు.
Tags : 1