Breaking News

శోభిత-నాగచైతన్య జంట.. పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా?

Published on Wed, 01/15/2025 - 10:26

టాలీవుడ్ హీరో నాగచైతన్య గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి కోసం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగానే వేదికను ఏర్పాటు చేశారు. హీరో వెంకటేశ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు.

పెళ్లి తర్వాత తొలి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు చైతూ, శోభిత. ఈ పొంగల్‌ వేడుక ఫోటోలను శోభిత ఇన్‌ స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. భోగిమంటతో పాటు ముగ్గులు వేసిన ఫోటోలను పంచుకుంది. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా శోభిత సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.

కాగా.. నాగ చైతన్య, శోభిత ధూళిపాల 2022 నుంచి రిలేషన్‌లో ఉన్నారు. గతేడాది ఆగస్టు 8న ఈ జంట హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లిబంధంతో ఒ‍క్కటయ్యారు. 

తండేల్‌లో నాగ చైతన్య..

ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు.

చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో వస్తోన్న ఈ సినిమా  ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్‌, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తండేల్ కథేంటంటే..

నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో  శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది.  శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి   పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)