Breaking News

ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ

Published on Thu, 07/03/2025 - 10:43

బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్‌ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్‌లో.. తర్వాత సీరియల్స్‌లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్‌ కూడా నిర్మించారు. 

నా జీవితం అగ్నిపథ్‌ సినిమావంటిది
జై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్‌ కుచ్‌ హోతా హై మూవీ నుంచి నా లైఫ్‌ సడన్‌గా అగ్నిపథ్‌ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. 

అమ్మకు అన్యాయం
ఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్‌ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్‌లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్‌లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!

అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..
అగ్నిపథ్‌ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.

కష్టాలతో సావాసం
మరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్‌ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్‌ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్‌ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.

చదవండి: ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన భారీ బడ్జెట్‌ మూవీ.. ఎక్కడంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)