Breaking News

ఒక్క ఎపిసోడ్‌కు నా రెమ్యునరేషన్‌ ఎంతంటే..: స్మృతి ఇరానీ

Published on Fri, 08/08/2025 - 13:58

కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మళ్లీ బుల్లితెరపై కనిపించారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియల్‌ గత నెల నుంచే ప్రసారం అవుతుంది. అయితే, ఈ సిరీయల్‌ కోసం తను తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఎంత అనేది తాజాగా స్మృతి ఇరానీ పంచుకున్నారు. తాను ఫుల్‌టైమ్‌ రాజకీయనాయకురాలు అని, పార్ట్‌టైమ్‌ యాక్టర్‌ అని ఆమె ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ -2 సీరియల్‌తో తులసి విరానీగా  స్మృతి ఇరానీ తిరిగొచ్చారు. అయితే,తాను ఈ సిరీయల్‌ నటించేందుకు ఒక్కో ఎపిసోడ్‌ కోసం రూ. 14 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా  CNN-News18తో ఆమె మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. నిరంతరం మనం ఏదో పనిలో ఉంటూనే ముందుకు వెళ్లాలని  చెప్పారు. కేవలం ఆదాయం కోసమే పనిచేస్తే అనుకున్నది సాధించడం కష్టమని స్మృతి తెలిపారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే సీరియల్‌ నటిగా  స్మృతి ఇరానీ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. హిందీలో బాగా పాపులర్‌ అయిన 'అనుపమ' సీరియల్‌ కోసం రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆ రికార్డ్‌ను స్మృతి ఇరానీ దాటేశారు. మరో నటి హీనా ఖాన్‌ కూడా ఎపిసోడ్‌కు రూ. 2 లక్షలు రెమ్యునరేషన్‌ తీసుకుంటారు.

సుమారు 25 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్‌ 'క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ'. ఈ సీరియల్‌తో స్మృతి ఇరానీకి మంచి గుర్తంపు దక్కింది. 2000 ఏడాదిలో మొదలైన ఈ ధారావాహిక 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. అందులో తులసి పాత్రలో నటించిన స్మృతి ప్రేక్షకుల ఆదరణతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. దానికి సీక్వెల్‌గానే  'క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2' జులై 29 నుంచి ప్రసారం అవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)