Breaking News

నటన వదిలేయాలనుకున్నా..నా భార్య మాటలే నిలబెట్టాయి

Published on Fri, 01/10/2025 - 14:51

తమిళ హీరో శివకార్తికేయన్‌  రాజ్‌కుమార్‌ పెరియసామి  ’అమరన్‌’ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇండియన్‌ ఆర్మీ రాజ్‌పుత్‌ రెజిమెంట్‌లో కమీషన్డ్‌ ఆఫీసర్‌గా ఉన్న మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కధగా తీసిన అమరన్‌  చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్‌హిట్‌గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్‌ స్టార్‌ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్‌...  అఖమురుగదాస్‌  వెంకట్‌ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల  చిత్రాలకు సంతకం చేశాడు.
అలుపెరుగని యాత్ర...
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్‌ సాధించిన విజయం...సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి దాయకం. కాలేజీ  రోజుల్లోనే స్టాండప్‌ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, షార్ట్‌ ఫిల్మ్‌ నటుడు..కూడా. ఆ తర్వాత తొలుత స్టార్‌ విజయ్‌ టీవీ వేదికగా.. 2011లో టీవీ షోలను హోస్ట్‌ చేయడం ద్వారా శివకార్తికేయన్‌ తన కెరీర్‌ను ప్రారంభించాడు నిదానంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రలను పోషించాడు, సినిమాల్లోకి వచ్చి పుష్కరకాలం పూర్తయిన తర్వాత గానీ అతనికి పెద్ద బ్రేక్‌ వచ్చిందని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్‌ మాట్లాడుతూ  మూడేళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు  వెల్లడించాడు, అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు.

పరిశ్రమ మంచిదే...వ్యక్తులే....
సినిమా పరిశ్రమలో కొందరు  వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ, పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్‌ స్పష్టం చేశాడు. ఆర్ధిక ఇబ్బందులతో సహా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ..  తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నానన్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. 

తన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో భార్య, అత్తమామలు, పిల్లలపై భారం వేయకూడదని భావించానని చెప్పాడు. అయితే భార్య మాటలతో స్ఫూర్తి పొంది...  అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఎంబిఎ గ్రాడ్యుయేట్‌ గా, అతను ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగాడు.

కుమార్, చియాన్‌ తర్వాత నువ్వే...అన్న భార్య
ఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఈ అమరన్‌ హీరో వెల్లడించాడు. ‘ఇక్కడకి వచ్చేటప్పుము ’మీ దగ్గర ఏమీ లేదు, అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారు. గత 20 ఏళ్లలో,కుమార్‌ (అజిత్‌) సార్‌  చియాన్‌ (విక్రమ్‌) సార్‌ తర్వాత, బయటి వ్యక్తి ఎవరూ ఈ పరిశ్రమలో పెద్దగా ఎదిగింది లేదు, కాని నువ్వు అది సాధించావ్‌.  ’ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దు.’మీ స్టార్‌డమ్‌ ప్రయోజనాలను మేం అనుభవిస్తున్నాం కాబట్టి,కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోగలం’’ అని తన భార్య చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నాడు.

సినీ పరిశ్రమలో తన ఎదుగుదల సమయంలో ఎదుర్కొన్న శత్రుత్వం  సవాళ్ల గురించి కూడా శివకార్తికేయన్‌ చర్చించారు. ‘సామాన్యుడు‘ నుంచి విజయవంతమైన నటుడిగా తన ప్రయాణాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు బహిరంగంగా విమర్శించారని, పరిశ్రమలో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, గత ఐదేళ్లలో గణనీయమైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయాణం కొనసాగించానని  ఘర్షణ లేకుండా ముందుకు సాగాలని కోరుకున్నానన్నాడు..అయితే నేటి తన విజయం విమర్శకులకు ఖండన అనుకోనక్కర్లేదని, సహకరించిన కష్టపడి పనిచేసే తన చిత్ర బృందాలకుు, తన పట్ల అంకితభావంతో ఉన్న అభిమానులకు  అతని కథ నుండి ప్రేరణ పొందిన వారికి వేడుకగా మాత్రమే అనుకోవాలని వినమ్రంగా చెబుతున్నాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)