Breaking News

హీరో అవుతానంటే కమెడియన్‌ అన్నారు: శివకార్తికేయన్‌

Published on Mon, 11/24/2025 - 15:19

ఇప్పుడున్న ఎంతోమంది స్టార్‌ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్‌ శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.

సినిమాల్లోకి వస్తావా?
టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్‌.సినిశ్‌ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్‌? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్‌' మూవీలో చిన్న కామెడీ రోల్‌ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.

కామెడీ పాత్రలే సెట్టు!
ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్‌? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్‌.. అలాంటి పాత్రలు ట్రై చేయ్‌ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్‌ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్‌ మర్చిపోలేదు. 

నేను మర్చిపోయా.. కానీ!
నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్‌ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.

చదవండి: నా ముఖం చూస్తేనే లవ్‌ ఫెయిల్యూర్‌: ధనుష్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)