Breaking News

ఇప్పటికీ భార్యనే డబ్బు అడుగుతా: శివకార్తికేయన్‌

Published on Wed, 03/11/2026 - 19:10

తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్‌ కిళవి' బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాధికా శరత్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చేయి చాచి అడుగుతా
ఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్‌లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్‌ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను. 

వాళ్లందరికీ సినిమా అంకితం
తను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్‌ శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించిన తాయ్‌ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్‌ దాస్‌, బాల శరవణన్‌, ముత్తుకుమార్‌, రేచల్‌ రెబెకా, జార్జ్‌ మరియణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందించాడు.

చదవండి: భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్‌ హన్సిక

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)