Breaking News

డియర్‌ అక్క.. నువ్వు సాధించిన ఈ విజయం నాకు స్పూర్తి: శివకార్తికేయన్‌

Published on Thu, 12/05/2024 - 17:54

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ తాజాగా సోషల్‌మీడియా ద్వారా  తన అక్క గౌరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ఓమోషనల్‌ నోట్‌ రాశారు. ప్రస్తుతం నెట్టింట భారీగా వైరల్‌ అవుతుంది. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో రేంజ్‌కు చేరుకున్నాడు.  తను నటించిన రీసెంట్‌ హిట్‌ సినిమా అమరన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 330 కోట్లకు పైగా సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

శివకార్తికేయన్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో అయినప్పటికీ చాలా సాధారణమైన జీవనశైలినే ఇష్టపడుతారు. ఈ క్రమంలో తాజాగా తన సోదరి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలా పంచుకున్నారు. 'నా జీవితంలో ఆదర్శంగా నిలుస్తున్న ప్రియమైన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత  MBBS (డాక్టర్‌ కోర్సు) పూర్తి చేశావ్‌.. తల్లిగా నీ బాధ్యతలు చేస్తూనే 38 ఏళ్ల వయసులో MD వంటి ఉన్నతమైన కోర్సును పూర్తి చేసి గోల్డ్‌మెడల్‌ సాధించావ్‌. 

ఇప్పుడు 42 ఏళ్ల వయసులో FRCP సాధించావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తూ విజయాన్ని అందుకున్నావ్‌.. ఈ సందర్భంలో మన నాన్న ఉండుంటే చాలా గర్వంగా ఉండేది అక్క' అంటూ తన సోదరి గురించి చెబుతూ ఆయన ఒక నోట్‌ విడుదల చేశారు.

శివకార్తికేయన్ వివాహం కూడా తన దగ్గరి బంధువుల అమ్మాయి అయిన ఆర్తితో జరిగింది. 2010 ఆగస్టు 27న  ఆర్తిని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)