Breaking News

1965లో ఏం జరిగిందో చెప్పనున్న శివకార్తికేయన్‌

Published on Sat, 01/04/2025 - 06:57

అయలాన్, మావీరన్‌ చిత్ర వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌కు తాజాగా అమరన్‌ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆయన, సాయిపల్లవి నటన పలువురి ప్రశంసలను అందుకుంది. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్‌ తన 23వ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. అదేవిధంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో 24వ చిత్రాన్ని చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్‌ హీరోగా నటించే 25వ చిత్రానికి మహిళా దర్శకురాలు సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. 

వాస్తవానికి ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించాల్సి ఉంది. దీనికి పురనానూరు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల సూర్య ఈ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ను ఎంపిక చేశారు. ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనుండడం విశేషం. అదేవిధంగా మరో నటుడు అధర్వ ముఖ్యపాత్ర పోషించనున్నారు. నటి శ్రీలీల నాయకిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈమె ఈ చిత్రం ద్వారా నేరుగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. 

డాన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 1965లో జరిగే చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కాగా ఇంతకుముందు దీనికి పురనానూరు అనే టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పేరును మార్చినట్లు, 1965 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)