Breaking News

శివకార్తికేయన్‌ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..?

Published on Sun, 11/10/2024 - 18:42

మావీరన్‌, అయలాన్‌, అమరన్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టిన నటుడు శివకార్తికేయన్‌. అయితే, తాజాగా విడుదలైన అమరన్‌ మంచి విజయాన్ని సాధించడంతో పాటు, సినీ విమర్శకుల ప్రశంసలను పొందడం విశేషం. కాగా ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న శివకార్తికేయన్‌ ప్రస్తుతం ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 23వ చిత్రం కావడం గమనార్హం. 

ఇందులో ఆయన పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని ఇటీవల ఓ భేటీలో నటుడు శివకార్తికేయన్‌ తెలిపారు. కాగా ఈ చిత్రంతో పాటు దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ హిందీలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఒక చిత్రం చేస్తున్నారు. అయితే శివకార్తికేయన్‌ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసి ఆ తరువాత హిందీ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించినట్లు తాజా సమాచారం. 

ఆ విధంగా ఇంకా పేరు నిర్ణయించని శివకార్తికేయన్‌ చిత్రానికి సింగనై అనే టైటిల్‌ పేరు ప్రచారంలో ఉంది. కాగా ఈ యాక్షన్‌ ఎంటర్‌టెయిన్‌ కథా చిత్రాన్ని 2025 మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. కాగా ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్‌ సిబి.చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం, సుధా కొంగర దర్శకత్వంలో పురనానూరు చిత్రంలో నటించడానికి కమిట్‌ అయ్యారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)