Breaking News

ఆర్య సినిమా చేయనన్నాను, ఎందుకంటే?: శివ బాలాజీ

Published on Sun, 05/07/2023 - 19:58

బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ విన్నర్‌ శివ బాలాజీ  ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే ఆర్య, చందమామ, శంభో శివ భంభో వంటి సినిమాలు టక్కుమని కళ్లముందు మెదులుతాయి. తాజాగా అతడు ఓ షోలో తనకు పేరు తెచ్చిన సినిమాలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. 'సుకుమార్‌ గారు ఆర్య ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్లాను. వెంటనే ఓకే చేశారు. అయితే ఆ సినిమాలో నాది నెగెటివ్‌ పాత్ర కావడంతో చేయనని చెప్పేశాను. కానీ వాళ్లందరూ నాకు సర్ది చెప్పడంతో చివరికి ఒప్పుకున్నాను. అల్లు అర్జున్‌ ఆర్య సినిమా సమయంలో ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు.

ఆర్య తర్వాత మల్టీస్టారర్‌ సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చేసుకుంటూ పోయాను. కానీ చందమామ సినిమా చేయడానికి చాలా భయపడ్డాను. డైరెక్టర్‌ కృష్ణవంశీ గారు చందమామ సినిమా కోసం ఆడిషన్‌ చేశారు. రాఖీ సినిమాలోని క్లైమాక్స్‌ డైలాగ్‌ చెప్పమని అడిగారు. నేను చెప్పిన తీరు ఆయనకు అంతగా నచ్చలేదు. ఆ విషయం అర్థమైన నేను ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ రాదని ఫిక్సయ్యాను.

కానీ కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని ఫోన్‌ కాల్‌ వచ్చింది. అపనమ్మకంగానే సెట్స్‌కు వెళ్లేవాడిని. షూటింగ్‌ జరుగుతున్నా నాకు నమ్మకం కలగలేదు. అసలు నన్ను ఈ సినిమాలో ఉంచుతారా? మధ్యలోనే తీసేస్తారా? అనుకుంటూనే చిత్రీకరణ పూర్తి చేశాను. తీరా సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. చందమామ సక్సెస్‌ మీట్‌కు వెళ్లేటప్పుడు కృష్ణవంశీ పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి అందరితో కలిసిపోవాలి. లేదంటే నీలో ఉన్న ప్రతిభ ఎవరికీ తెలియకుండా పోతుంది అని చెప్పారు' అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు శివబాలాజీ.

చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్‌, 10 సెకన్లలో జీవితమంతా..
బలవంతంగా బంధంలో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే నయం: సదా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)