Breaking News

'సితారే జమీన్ పర్‌' మూవీ ఆఫర్‌.. రెండు రోజులు మాత్రమే

Published on Thu, 08/14/2025 - 14:56

బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్ న‌టించిన‌ ‘సితారే జమీన్ పర్‌’ (Sitaare Zameen Par) చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్‌లో రన్‌ అవుతున్న ఈ సినిమాను చూడాలంటూ రూ. 100 చెల్లించాల్సి ఉంది. పే-పర్-వ్యూ (Pay-per-view) మోడ‌ల్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం రెంట్‌ తాజాగా తగ్గించారు. థియేటర్‌లో ప్రదర్శన అనంతరం నేరుగా యూట్యూబ్‌లోనే ఈ మూవీని ఆయన విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

ఇండిపెండెన్స్ డే కానుక‌గా సితారే జమీన్ పర్‌ సినిమాను కేవ‌లం రూ. 50ల‌కే చూడొచ్చని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రాన్ని చూడాలని ఆసక్తి ఉంటే యూట్యూబ్‌లో కేవ‌లం రూ. 50 చెల్లిస్తే స‌రిపోతుంది. అయితే, ఈ ఆఫ‌ర్ కేవలం ఆగ‌ష్టు 15 నుంచి 17 వ‌ర‌కు మాత్రమే ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఆమిర్‌ ఖాన్‌ ఒక వీడియో విడుదల చేశారు. ఆర్‌.ఎస్‌. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్‌ కామెడీ డ్రామా మూవీ జూన్‌ 20న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం గురించి మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. సితారే జమీన్ పర్‌ అందరి మనసులు దోచుకుంటోందని ఆయన అన్నారు. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుందని చెప్పారు. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారని ఆయన అన్నారు.

సితారే జమీన్‌ పర్‌ మూవీలో ఆమిర్‌ ఖాన్‌, జెనీలియా జంటగా నటించారు. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)