Breaking News

ఆమిర్ కొత్త సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?

Published on Sat, 06/21/2025 - 12:32

రీసెంట్ టైంలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018లో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'తో వస్తే దారుణమైన డిజాస్టర్. 2022లో 'లాల్ సింగ్ చద్దా'తో వస్తే అదే సీన్ రిపీట్. దీంతో విపరీతమైన ట్రోలింగ్. కట్ చేస్తే యాక్టింగ్ కొన్నాళ్ల పాటు చేయనని చెప్పిన ఆమిర్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సితారే జమీన్ పర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తొలిరోజు ఎంత కలెక్షన్ వచ్చాయంటే?

స్పానిష్ మూవీ 'ఛాంపియన్స్'కి రీమేక్‌గా 'సితారే జమీన్ పర్' సినిమా తీశారు. రిలీజ్‌కి ముందే ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో కాస్త హడావుడి చేశాడు గానీ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.11.5 కోట్ల మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన హిందీ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన 6వ చిత్రంగా నిలిచింది. అయితే ఆమిర్ స్టార్‌డమ్‌కి ఈ కలెక్షన్ చాలా తక్కువనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)

ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తీస్తున్న సినిమాలే తొలిరోజు రూ.10-20 కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. అలాంటిది ఆమిర్ ఖాన్ సినిమాకు తొలిరోజు దాదాపు రూ.11 కోట్లు మేర వసూళ్లు రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్స్‌లో ఈ నంబర్స్ పెరగొచ్చేమో చూడాలి? ఈ సినిమాని ఏ ఓటీటీకి అమ్మని ఆమిర్.. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.

'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా గుల్షన్ అరోరా(ఆమిర్ ఖాన్) పనిచేస్తుంటాడు. హెచ్ కోచ్‌తో గొడవ జరిగి అతడిని కొడతాడు. ఆ కోపంలో తాగి బండి నడిపి పోలీస్ వాహనాన్ని గుద్దేస్తాడు. దీంతో కోర్ట్.. శిక్ష విధించకుండా మానసిక దివ్యాంగులకు మూడు నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అలా 10 మంది దివ్యాంగులకు కోచ్‌గా మారతాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో గుల్షన్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‍‌లో 'సితారే' టీమ్ గెలిచిందా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)