Breaking News

ఆదిపురుష్‌ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్‌’ సీత

Published on Wed, 06/21/2023 - 19:57

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్  చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్‌ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.  ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు.

అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్‌పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్‌కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. 
(ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!)

తాజాగా రామాయణం సీరియల్‌లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్‌పై మాట్లాడుతూ  ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు.  రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్‌లో దీపిక  సీత పాత్ర పోషించింది. 

దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. 

ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె.  కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 
(ఇది చదవండి: చరణ్‌ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..)


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)