Breaking News

కట్నంగా 40 గోల్డ్‌ బ్యాంగిల్స్‌ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్‌ కుమారుడు

Published on Sat, 03/08/2025 - 16:52

కొత్త పెళ్లికూతురా రారా.., ఓహో బావా.. మార్చుకో నీ వంకరటింకర దోవ.., కాశీకి పోయాను రామా హరి.. వంటి ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఆలపించింది లెజెండరీ సింగర్‌ స్వర్ణలత (Singer Swarnalatha). తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్య గీతాలు ఆలపించింది. ఎనిమిది భాషల్లో పాటలు పాడిన ఆమె దాదాపు 30 చిత్రాల్లో నటించింది కూడా! ఈమె పుట్టుక, చావు ఒకే రోజు జరిగాయి. ఆమె పెద్ద కుమారుడు ఆనంద్‌ రాజ్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు అనిల్‌రాజు పలు సినిమాల్లో డ్యాన్స్‌మాస్టర్‌గా పని చేశాడు. మరో ఏడుగురు సంతానం డాక్టర్స్‌ అయ్యారు.

ఏడేళ్లకే గాయని
తాజాగా అనిల్‌ రాజు ఓ ఇంటర్వ్యూలో తల్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఏడు సంవత్సరాల వయసులోనే గాయని అయింది. తన అసలు పేరు మహాలక్ష్మి. రేడియోలో అమ్మ గాత్రం విని డైరెక్టర్‌ బాలచందర్‌ తనకు తొలి అవకాశం ఇచ్చాడు. అలా సినిమాల్లోకి వచ్చింది. మా అమ్మగారికి తొమ్మిదిమంది సంతానమవగా పదిమంది కుక్కల్ని పెంచుకునేది. ఓసారి అమ్మ ముస్లింకుటుంబ వివాహానికి వెళ్లింది. కట్నం ఇ‍వ్వలేదని వరుడు పెళ్లే వద్దనడంతో అమ్మ తన చేతికున్న 40 బంగారు గాజుల్ని ఇచ్చి ఆ పెళ్లి చేసింది. 

ఆ మాటలు బాధించేవి
అయితే అన్నల పెళ్లిళ్లయ్యేసరికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. మా వదిన.. అమ్మను వృద్ధాశ్రమంలో వదిలేద్దామనేది. అవి అమ్మ మనసును బాధించేవి. అమ్మ ఎప్పుడూ బంగారు ఆభరణాలు ధరించేది. 1972లో సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి భక్తిగీతాలు పాడేది. అలా 1997న మార్చి 5న నేను, అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాం. అప్పుడు అమ్మ ఒంటిమీద రూ.4.50 లక్షల విలువైన బంగారం ఉంది. చిన్నవంగల్‌ అనే ‍గ్రామానికి రాగానే గుర్తు తెలియని దుండగులు మా కారును ఆపేశారు.

3 కిలోల బంగారం
డ్రైవర్‌ను, నన్ను, అమ్మను కొట్టారు. ఐదురోజులవరకు అమ్మ ఆస్పత్రిలో పోరాడుతూ మార్చి 10న తుదిశ్వాస విడిచింది. అమ్మ నివసించిన ఇంటిని అమ్మేయగా రూ.100 కోట్లు వచ్చాయి. దాన్ని తొమ్మిది మంది పంచుకున్నాం. అందులో రూ.3 కోట్లతో తన జీవితకథపై సినిమా తీస్తున్నాం. అమ్మ వెళ్లిపోతూ నాకు 3 కిలోల బంగారం ఇచ్చింది. తన 500 పట్టుచీరలు ఇప్పటికీ నాదగ్గరే ఉన్నాయి. కొన్ని చీరల్లో బంగారంతో తయారు చేసినవి.

నేను హిజ్రా..
నాకు 16 ఏళ్ల వయసు రాగానే నాలో ఆడలక్షణాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో నుంచి ముంబైకి వెళ్లిపోయాను. మా అమ్మకు విషయం అర్థమై.. నువ్వు చీర కట్టుకో, ప్యాంటు షర్ట్‌ వేసుకో.. ఎలాగైనా ఉండు, కానీ నేను చనిపోయేవరకు నా దగ్గరే ఉండు అంది. మా అన్నకేమో నేను హిజ్రాలా ఉంటే నచ్చేది కాదు. చాలా ఏండ్లు కాటుక, లిప్‌స్టిక్‌ పెట్టుకుని చీర కట్టుకుంటూ ఉండేవాడిని. అన్నదమ్ములెవరూ నాతో మాట్లాడేవారు కాదు. ఇప్పుడు నాలో హిజ్రా లక్షణాలు తగ్గిపోయాయి అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ‘ఛావా’ తెలుగు వెర్షన్‌కి ఊహించని ఓపెనింగ్స్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)