Breaking News

కేవలం సాంగ్స్, ముద్దుల కోసమేనా?.. జాన్వీ రోల్‌పై సింగర్‌ షాకింగ్ పోస్ట్

Published on Fri, 06/05/2026 - 16:39

టాలీవుడ్‌లో ఇప్పుడంతా పెద్ది హవా నడుస్తోంది. జూన్‌ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్‌ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా పెద్దికి కలిసొచ్చింది. దీంతో మొదటి రోజే సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా మెప్పించింది.

అయితే ఈ మూవీ జాన్వీ కపూర్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని టాక్ వినిపిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే జాన్వీని తీసుకున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సింగర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పెద్దిలో జాన్వీ పాత్రను ఓవర్‌గా చూపించారని ఆరోపిస్తున్నారు. కేవలం సెక్సువల్‌ అట్రాక్షన్‌ కోసమే ఆమెను సినిమాలో తీసుకున్నారని సింగర్ సుమంగళి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా మేకర్స్ నిస్సహాయత వల్ల కలిగే వేదన చుట్టూ ఒక కథను అల్లారని.. కానీ జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్రకు అదే గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇ‍ప్పటికే జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.

సుమంగళి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ..'శక్తివంతమైన పురుషులతో నిండిన ఒక గదిలో కూర్చుని నిస్సహాయత వల్ల కలిగే వేదన గురించి ఒక కథను రాశారు. వాళ్లు అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రను కెమెరా ముందు కేవలం బలవంతపు ముద్దు పెట్టే ఒక వస్తువుగా.. పాటలు అయిపోయాక ఆమె పక్కకు పారేసే ఓ వస్తువుగా మాత్రమే చూపించారు. ఒక మనిషిని గౌరవించడం ఏమిటో వారికి కచ్చితంగా తెలుసు. కానీ ఆమె దానికి జాన్వీ కపూర్ అర్హురాలు కాదని ముందే నిర్ణయించుకున్నారని ఆమె విమర్శించారు. ఈ సినిమాలో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. భారతీయ సినిమాలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం అంటూ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్‌ను షేర్ చేసింది.

హీరోయిన్‌ కేవలం గ్లామర్‌ కోసమే కాదని.. ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలని నెటిజన్స్ కోరుతున్నారు. సాంగ్స్, ముద్దుల కోసమే వారిని సినిమాలో చూపించడం కరెక్ట్ కాదంటున్నారు. మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా చూడటాన్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా పెద్ది మూవీలోని జాన్వీ కపూర్‌ సీన్స్‌పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమతి లేకుండా హీరోయిన్‌ను తాకాలనుకుంటున్నానని పెద్ది చెప్పే సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ లైంగిక దాడి కిందకే వస్తాయని చాలా మంది విమర్శిస్తున్నారు.

 

Videos

రిలీజ్ వెంటనే పెద్దికి జాన్వీ కపూర్ ఝలక్

భారత జట్టులోకి బుడ్డోడు

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టైటిల్ సొంతం

నా గర్భస్రావానికి సీఎం విజయ్ నే కారణం

విజయ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సీఎం అయినా తీరని కష్టాలు

TDP కొంపముంచుతున్న కోవర్టులు.. చింతమనేని మెడకు.. గంట పద్మశ్రీ ఉచ్చు

ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్నా.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

కేరళ, కర్ణాటకలో అలర్ట్ ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక

ప్రాజెక్ట్‌లు లీక్, ఈనాడు కిరణ్ వియ్యంకుడుకి పోలవరం టెండర్

SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

Photos

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్‌ సందడి (ఫొటోలు)

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు