Breaking News

శ్రావణ భార్గవికి రెండో పెళ్లా..? హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు వైరల్‌

Published on Sun, 09/17/2023 - 07:12

బోయపాటి- బాలయ్య కాంబినేషన్లో 2010లో వచ్చిన సింహా చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' అంటూ సిల్వర్‌ స్క్రీన్‌పై తన వాయిస్‌తో మ్యాజిక్‌ చేశారు గాయని శ్రావణ భార్గవి. సంగీతంపై ఆమెకు ఉన్న ఆసక్తినే ప్రముఖ గాయనిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది.  కీరవాణి,దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, చక్రి, మణిశర్మ, మిక్కీ జె మేయర్‌ ఇలా స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లతో ఆమె  కలిసి పనిచేశారు. సింగర్‌ గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ ఆమె టాలెంట్‌ చూపించారు. కెరీర్‌లో రాణిస్తున్న తరుణంలోనే ప్రముఖ సింగర్‌ హేమచంద్రతో శ్రావణ భార్గవి ఏడు అడుగులు వేశారు.

మొదటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ 2013లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. అయితే, వ్యక్తిగత కారణాలతో వీళ్లద్దరూ విడిపోయారని గతంలోనే పలు వార్తలు వచ్చాయి. ఆ వార్తలలో నిజం లేదనే అర్థం వచ్చేలా వారిద్దరూ అప్పట్లోనే తిప్పికొట్టారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ కలిసి ఎలాంటి ప్రొగ్రామ్‌ చేయడం కానీ.. ఒక వేదిక మీద కనిపించడం కానీ జరగలేదు. కొన్ని నెలలుగా శ్రావణ భార్గవి సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా హేమ చంద్ర మాత్రం తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉన్నారు.

(ఇదీ చదవండి: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆడియో లీక్‌.. క్రిమినల్‌ కేసు పెట్టిన దిల్‌రాజు)

గతంలో వారిద్దరూ చాలా ప్రోగ్రామ్స్‌ జంటగా చేశారు.. కానీ కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి చేసిన ఒక్క ప్రోగ్రామ్‌ కూడా లేదు. దీంతో వారిద్దరూ దాదాపు విడిగానే ఉన్నారు అనేది నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఆమె హల్దీ ఫంక్షన్‌లో ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడమే. దీంతో ఆ ఫోటోలు చూసిన కొందరు శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది.

వాస్తవానికి ఆ ఫోటోలు తన సొదరుడు అయిన హరీష్‌ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించినవి. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన కార్యక్రమానికి చెందిన ఫోటోలను ఇప్పుడు వైరల్‌ చేస్తూ.. ఆమెకు రెండో పెళ్లి అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆమె విడాకులే తీసుకోలేదు, వాటిపై క్లారిటీ ఇవ్వలేదు.. అంటే వారిద్దరూ భార్యాభర్తలే అని అర్థం. అలాంటిది రెండో పెళ్లి అని ఎలా రూమర్స్‌ క్రియేట్‌ చేస్తారని పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)