Breaking News

మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్‌

Published on Mon, 06/30/2025 - 13:12

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్స్‌ శ్రావణ భార్గవి (Ravuri Sravana Bhargavi)- హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడూ వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురితో ఒంటరిగా ట్రిప్స్‌కు వెళ్తోంది శ్రావణ భార్గవి. దీంతో వీరు దాపంత్య జీవితానికి స్వస్తి పలికి, ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది.

తప్పు చేస్తున్నామా?
తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్లు.. వీటితోనే బతికేయడంలో అర్థంపర్థం లేదు. ప్రేమ ఒక్కటే అర్థవంతమైనది. మనం మనస్ఫూర్తిగా ఒకర్ని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా? అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు. ఉదారంగా, మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే.. మనం జీవితంలో గెలిచామా? ఓడామా? అనేది నిర్ణయిస్తుంది అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

హేమచంద్రతో ప్రేమపెళ్లి
టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ శ్రావణ భార్గవి.. పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా! అలాగే హీరోయిన్స్‌కు డబ్బింగ్‌ కూడా చెప్తుంది. ‘గబ్బర్‌సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్‌కి డబ్బింగ్ చెప్పింది. ఈగ హిందీ వర్షన్‌లో సమంతకు డబ్బింగ్‌ చెప్పింది. 2013లో సింగర్‌ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి- హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలు చేశారు. ఓ షోలో జడ్జిలుగా కూడా వ్యవహరించారు. లక్కీ లవ్‌ అనే షార్ట్‌ ఫిలింలో జంటగానూ నటించారు.

చదవండి: రూ. 25 కోట్ల ఎఫెక్ట్‌.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న నటుడు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)