'అందుకే జానకమ్మను చివరిసారి చూడలేకపోయా'.. సింగర్ శ్వేత ఎమోషనల్

Published on Wed, 07/15/2026 - 18:08

ప్రముఖ లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ మరణాన్ని తలచుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 11న లండన్‌లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీలో శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలామంది అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జానకి అంత్యక్రియలకు హాజరు కాలేదని శ్వేతపై కొందరు ట్రోలింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

శ్వేతా మోహన్ తన ఇన్‌స్టాలో రాస్తూ "జానకి అమ్మ అంత్యక్రియలకు నేను ఎందుకు హాజరు కాలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు... ఆ టైమ్‌లో నేను లండన్‌లో ఇళయరాజా సార్ సంగీత కచేరీలో పాల్గొన్నా. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆమె అంబులెన్స్‌లో ఉన్నప్పుడు చివరిసారిగా వీడియో కాల్‌లో చూశా. నన్ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నా. నన్ను ఎగతాళితో ప్రశ్నించిన వారందరికీ నా విజ్ఞప్తి. దయచేసి ఇది మానసికంగా చాలా కష్టమైన సమయం. దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి," అని ఆమె రాసింది.

ఈ పోస్ట్‌కు  ఆమె అభిమానుల నుంచి మద్దతు లభించింది. జానకమ్మ మరణంతో మీరు ఎంతగా కుంగిపోయారో మేము చూశామని రాసుకొచ్చాడు. మీరు అంతలా నిబ్బరంగా ఉన్నందుకు మీకు చాలా గౌరవంగా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. కాగా.. జానకి మరణవార్త విన్న తర్వాత శ్వేత సోషల్ మీడియాలో నివాళులర్పించారు.

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)