Breaking News

ప్రముఖ గాయని జానకి కన్నుమూత

Published on Sat, 07/11/2026 - 20:15

ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు.

సినీ ప్రస్థానం: 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత.సంగీత ప్రయాణం: లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్‌ జానకి.

పురస్కారాలు 
జాతీయ అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల నుండి 30కి పైగా అవార్డులు పొందారు. 1986లో కలైమామణి అవార్డు, 1997లో ఫిలింఫేర్‌, 2002లో అచీవర్‌ అవార్డు, 2005లో జేసుదాసు అవార్డులు ఆమెను వరించాయి.

 2009లో మైసూర్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. 2015లో సైమా లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం ఆమెకు లభించాయి. మౌనపోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు జానకి.

పద్మభూషణ్ తిరస్కరణ: 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' పురస్కారాన్ని, దక్షిణాది కళాకారులకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తోందని నిరసిస్తూ ఆమె గౌరవపూర్వకంగా తిరస్కరించారు. 

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)