Breaking News

ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్ మికా సింగ్

Published on Sat, 03/01/2025 - 14:58

ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ మికా సింగ్ బీటౌన్‌లో దాదాపు పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతేకాదు మన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు వీరాభిమానిని కూడా. బాలీవుడ్‌లో ఫేమస్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న మికా సింగ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్‌కు రూ. 50 లక్షల విలువైన డైమండ్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ రింగ్‌ను షారూఖ్‌ నాకు తిరిగి ఇచ్చారని వెల్లడించారు. అంతే కాదు షారూఖ్ తన లగ్జరీ కారును మూడు నెలల పాటు వాడుకున్నారని మికా సింగ్ తెలిపారు.

ఇంటర్వ్యూలో మికా మాట్లాడుతూ.. ' బాలీవుడ్ ఉత్తమ నటులలో షారూఖ్ ఒకరు. అంతేకాదు పెద్ద మనిషి కూడా. ఆయన నాకు తిరిగిచ్చిన ఉంగరాన్ని ఎల్లప్పుడూ ధరిస్తా. ఎందుకంటే దీని విలువ దాదాపు రూ.50 లక్షలు. ఇలాంటి రింగ్స్ నేను అమితాబ్ బచ్చన్, గురుదాస్ మాన్‌లకు కూడా బహుమతిగా ఇచ్చాను. అయితే  దీన్ని మొదటిసారి బహుమతిగా షారూఖ్‌ ఖాన్‌కే ఇచ్చా. ఎందుకంటే ఈ ముగ్గురి కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నా. ‍అయితే మరుసటి రోజు షారూఖ్ కాల్ చేసి.. దయచేసి ఈ ఉంగరాన్ని వెనక్కి తీసుకోండి.. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది అని నాతో అన్నారు. అయితే ఒకసారి ఆయన కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అదే సమయంలో నా కారు ఇచ్చి ఆయనను ఇంటికి పంపించా. ఆ తర్వాత నా కారు షారూఖ్‌కు నచ్చడంతో దాదాపు మూడు నెలలపాటు తన వద్దే ఉంచుకుని వాడుకున్నారని' మికా పంచుకున్నారు.

ఇటీవల హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీలో తాను షారుఖ్ ఖాన్‌తో సరదాగా గడిపామని మికా సింగ్ వెల్లడించారు. ఈ పార్టీకి హీరో రణ్‌వీర్ సింగ్ కూడా హాజరయ్యాడని చెప్పాడు. పార్టీ అయిపోయిన తర్వాత అంతా కలిసి ఓకే కారులో వెళ్లామని వివరించారు. షారూఖ్ వినియాగించిన కారు తన వద్దే ఉంచుకున్నానని మికా తెలిపారు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)