Breaking News

నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన

Published on Fri, 03/07/2025 - 09:20

ప్రముఖ సింగర్‌ కల్పన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. కొద్దిరోజుల క్రితం ఆమె అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకొని అపస్మారక స్థితిలోకి వెల్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమె భర్తపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కల్పన స్పందించారు. తన భర్తపై మీడియాలో ఎలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయకండి అంటూ ఆమె రిక్వెస్ట్‌ చేశారు. కేవలం పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతోనే టాబ్లెట్స్‌ వేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

'నన్ను కాపాడిన మీడియా, పోలీసులకు కృతజ్ఞతలు. స్ట్రెస్‌ వల్ల గత కొద్దిరోజుల నుంచి నాకు సరిగ్గా నిద్రపట్టడం లేదు. అందువల్లే ట్యాబ్‌లెట్స్‌ వేసుకున్నాను. అయతే, అది డోస్‌ ఎక్కువ కావడం వల్లే ఇలా జరిగింది. కానీ, మీడియాలో నాతో పాటు నా భర్త గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలని ఆసుపత్రి నుంచే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు పూర్తి క్షేమంగా ఉన్నాను. ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. ఇదంతా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ ప్రోత్సాహం వల్లే జరుగుతుంది. చాలా రోజులుగా మ్యూజికల్‌ ప్రోగ్రామ్స్‌లలో పాల్గొనడంతో నిద్ర పట్టడం లేదు. వర్క్‌ స్ట్రెస్‌ ఎక్కువగా ఉంది. అందుకోసం వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నాను. 

వారు సూచించిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం కాకుండా ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయాను. ఆ సమయంలో నా భర్త కేరళలో ఉండటం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఆపై కాలనీవాసుల, మీడియా సహాయం వల్ల నేను మీ ముందు క్షేమంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మీ ముందుకు వస్తాను.  నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త ప్రసాద్ ప్రభాకర్. ఆయనతో పాటు నా కూతురు సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు.. ఎవరూ తప్పుడు ప్రచారం చేయకండి ప్లీజ్‌.. నా క్షేమం కోరుకున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు' అని ఆమె తెలిపారు.


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)