Breaking News

మంగళసూత్రం ఎపిసోడ్‌.. చిన్మయి కౌంటర్!

Published on Wed, 11/05/2025 - 10:19

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద‌ ఎపిసోడ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్‌ చేసిన కామెంట్స్‌పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. మంగళసూత్రం ధరించడమనేది చిన్మయి ఇష్టమని.. తానైతే తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పనని అన్నారు. ఈ కామెంట్స్‌పై కొందరు నెటిజన్స్‌ విమర్శించగా.. మరికొందరు సమర్థించారు. దీంతో రాహుల్, చిన్మయి జంటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

దీంతో తమపై పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో సింగర్ చిన్మయి స్పందించింది. ఆయన ఏందో ఒక సందర్భంలో అలా మాట్లాడారని తెలిపింది. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న చర్చపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. కానీ మనదేశంలోని మహిళల గురించే ఆందోళన చెందుతున్నానన నెటిజన్లకు కౌంటరిచ్చింది.

(ఇది చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్)

ఓ నెటిజన్ చిన్మయి- వైరముత్తు ఎపిసోడ్‌పై ప్రశ్నించాడు. వైరముత్తు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు.. కానీ ఇక్కడ ఇతర మహిళల గురించి ఆందోళన చెందుతున్నారని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై చిన్మయి స్పందిస్తూ..అవును.. ఎందుకంటే లైంగిక వేధింపులకు గురి కావడం నా తప్పే.. కానీ మీలాంటి పురుషులు నా లైంగిక వేధింపుల ఎపిసోడ్ గురించి ఎందుకు ప్రస్తావించాలి? దయచేసి ఢిల్లీ గాలిని పీల్చుకోండి.. ఎందుకంటే నేను అలాంటి గాలిని తట్టుకోలేనంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. కాగా.. 2018లో మీటూ ఉద్యమం సమయంలో ఓ ఈవెంట్‌లో వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 20 మంది మహిళలు ఆతనిపై ఆరోపణలు చేశారు.

కాగా.. సింగర్ చిన్మయి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఏడాది డేటింగ్ తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూన్ 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీ నవంబర్ 7న రిలీజ్ కానుంది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)