రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్‌ నటి

Published on Fri, 10/03/2025 - 10:40

రావణాసురుడు కొంటెవాడే కానీ రాక్షసుడు కాదంటోంది బాలీవుడ్‌ సీనియర్‌ నటి సిమి గరేవాల్‌. దసరా పండగనాడు రావణుడి బొమ్మను దహనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ప్రతి ఏడాది దసరా రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటారు. కానీ రావణా.. నువ్వు కాస్త కొంటెగా ఉన్నావే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. కొంటెతనం తప్ప అంతకుమించి ఏ తప్పూ చేయలేదు.

తిండి పెట్టావ్‌
తొందరపడి ఒక అమ్మాయిని కిడ్నాప్‌ చేశావు. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవమర్యాదలతో పోలిస్తే అప్పట్లో నువ్వే ఒక స్త్రీ(సీతాదేవి)ని ఎంతో గౌరవించావు. ఆమెకు మంచి తిండి, ఆశ్రయం కల్పించావు. తన భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించావు(వాళ్లు అందంగా లేరనుకో..). పార్లమెంటులో ఉన్న సగం మంది సభ్యులకంటే కూడా నువ్వే ఎక్కువ చదువుకున్నావు. 

ట్వీట్‌ డిలీట్‌
రావణుడి బొమ్మను కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న.. అంతే! హ్యాపీ దసరా అని ట్వీట్‌ చేసింది. ఈ పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్వీట్‌ను డిలీట్‌ చేసింది. కాగా సిమి గరేవాల్‌.. దో బడాన్‌, మేరా నామ్‌ జోకర్‌, కర్జ్‌ వంటి సినిమాల్లో నటించింది. యాంకర్‌గా టాక్‌ షోలు కూడా చేసింది. కొన్ని సీరియల్స్‌, సినిమాలకు డైరెక్టర్‌గానూ వ్యవహరించింది.

చదవండి: తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్‌ మ్యాన్‌..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)