Breaking News

నాకు పెళ్లి ఎప్పుడో అయిపోయింది: శింబు

Published on Mon, 12/08/2025 - 11:56

నాలుగు పదులు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తని హీరోల్లో శింబు ఒకరు. ఈ తమిళ హీరో గతంలో నయనతార, హన్సిక వంటి హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు కానీ ఆ ప్రేమ పెళ్లి పట్టాలెక్కకముందే బ్రేకప్‌ అయింది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్‌ పెట్టిన ఈ హీరో ప్రేమ, పెళ్లిని కాస్త సైడ్‌కు నెట్టేశాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్‌లోనూ కాస్త ఫన్నీగా చెప్పాడు.

అందరి నోటా ఒకటే ప్రశ్న
మలేషియాలో ఓ కార్యక్రమానికి హాజరైన శింబుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ పూలమాలతో సాదరంగా ఆహ్వానించారు. తర్వాత అక్కడే ఉన్న ఓ యాంకర్‌.. సర్‌, అందరూ ఒకటే అడుగుతున్నారు.. అదే మీ పెళ్లెప్పుడు? అని మెల్లిగా కూపీ లాగింది. 

ఆల్‌రెడీ అయిపోయిందిగా!
అందుకు శింబు నవ్వుతూ.. అదేంటి, నాకు ఆల్‌రెడీ 120 సార్లు పెళ్లయిపోయిందిగా! అని జోక్‌ చేస్తూనే జీవితంలో ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అని బదులిచ్చాడు. లైఫ్‌లో ఒంటరిగా ఉన్నామా? ఒకరితో బంధాన్ని కలుపుకున్నామా? అన్నది ముఖ్యం కాదు. మనం మంచిగా ఉంటే అంతే చాలు అన్నాడు. 

అరసన్‌ మూవీ
తర్వాత అభిమానుల కోరిక మేరకు ఓ తమిళ పాటను ఆలపించాడు. ఇకపోతే ప్రస్తుతం శింబు 'అరసన్‌' (తెలుగులో సామ్రాజ్యం) సినిమా చేస్తున్నాడు. వేట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ రేపోమాపో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, సముద్రఖని, కిషోర్‌, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్నాడు.

చదవండి: రీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే!

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)