Breaking News

దక్షిణాది సినీ అవార్డుల పండుగ.. నామినేషన్స్‌లో పుష్పరాజ్‌దే హవా!

Published on Wed, 07/23/2025 - 16:42

దక్షిణాది సినీ అవార్డుల పండుగ సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనుంది. ఇప్పటికే వేదికతో పాటు తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ఈ అవార్డులకు ఎంపికైన నామినేషన్స్ జాబితాను వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన దక్షిణాది సినిమాలు ఈ అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఎంపికైన చిత్రాల జాబితాను తాజాగా సైమా అవార్డుల కమిటీ ప్రకటించింది.

తెలుగు సినిమాల విషయానికొస్తే అత్యధికంగా పుష్ప-2 చిత్రం నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా 11 విభాగాల్లో ఎంపికైంది. ఆ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి మూవీ పది నామినేషన్స్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. అంతేకాకుండా తేజ సజ్జా-ప్రశాంత్‌ వర్మ చిత్రం హను మాన్‌ కూడా 10 విభాగాల్లో నామినేషన్స్‌ సొంతం చేసుకుంది. కాగా... గతేడాదిలో రిలీజైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

ఇక కోలీవుడ్ విషయానికొస్తే శివ కార్తికేయన్‌- సాయిపల్లవి జంటగా వచ్చిన అమరన్‌ 13 నామినేషన్స్ దక్కించుకుంది. లబ్బర్‌ పందు 8, వాజై 7 విభాగాల్లో నిలిచాయి. ఇక శాండల్‌వుడ్‌లో భీమా, కృష్ణ ప్రణయ సఖి చిత్రాలు తొమ్మిది విభాగాల్లో నామినేషన్స్ సాధించాయి. ఇబ్బని తబ్బిడ ఇలియాలి - 7 విభాగాల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. అలాగే మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన ది గోట్‌ లైఫ్(ఆడుజీవితం) అత్యధికంగా 10 విభాగాలకు ఎంపికైంది. ఆ తర్వాత ఏఆర్‌ఎమ్‌ 9, ఆవేశం 8 నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ 13వ సైమా అవార్డుల వేడుక దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్ 5,6 తేదీల్లో జరగనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)