Breaking News

నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్‌!

Published on Mon, 10/13/2025 - 15:48

డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్‌ అయ్యాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). టిల్లు స్క్వేర్‌తో మరో పెద్ద హిట్‌ అందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన జాక్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుసు కదా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్‌ 17న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో సోమవారం (అక్టోబర్‌ 13) చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. 

ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించారా?
ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో సిద్ధుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రియల్‌ లైఫ్‌లో మీరు స్త్రీలోలుడా? టీనేజ్‌లో ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించడం లాంటివేమైనా చేశారా? అని ఓ మహిళా విలేఖరి ప్రశ్నించింది. అది విని సిద్ధుకు మండిపోయింది. ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్‌ ఇంటర్వ్యూనా? అని కోప్పడ్డాడు. ఈ మధ్యే తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌పైనా సదరు మహిళా జర్నలిస్ట్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

తమిళ హీరోను కించపరుస్తూ..
మీరు హీరోలానే ఉండరు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్‌ వచ్చిందంటే.. అది మీ హార్డ్‌ వర్కా? లేక అదృష్టమా? అని ప్రశ్నించారు. వెంటనే శరత్‌ కుమార్‌ మైక్‌ అందుకుని ఆమె ప్రశ్నను తప్పుపడుతూ కౌంటరిచ్చాడు. కిరణ్‌ అబ్బవరం సైతం స్పందిస్తూ... పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరిచే ప్రశ్నలు అడగొద్దని విజ్ఞప్తి చేశాడు. బిగ్‌బాస్‌ షోలో నాగార్జున సైతం.. ప్రదీప్‌ను రజనీకాంత్‌, ధనుష్‌తో పోలుస్తూ అతడు ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదుగుతాడని మెచ్చుకున్నాడు.

మీరు ఉమెనైజరా..?  ఇచ్చిపడేసిన సిద్ధూ

చదవండి: యూరిన్‌ తాగి 48 రోజులు బతికాడు: హీరో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)