Breaking News

ఎల్‌బీ నగర్‌లో హీరో సిద్దు, హీరోయిన్లు అనుపమ, శ్రీలీల సందడి!

Published on Mon, 01/23/2023 - 10:09

వాసవి ఆనంద నిలయం గేటెడ్‌ కమ్యూనిటీ ప్రారంభం లింగోజిగూడ: దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటి ప్రాజెక్ట్‌ ఎల్‌బీనగర్‌లో ప్రారంభమైంది. ఎల్‌బీనగర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద వాసవి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన ఆనంద నిలయం గేటెడ్‌ కమ్యూనిటీని ఆదివారం ప్రారంభించారు. శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ సినీ నటులు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీల పాల్గొని సందడి చేశారు.

వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్‌కుమార్, డైరెక్టర్‌లతో కలసి సినీ నటులు ఆనంద నిలయం లోగో, ఎలివేషన్, బ్రోచర్‌లను అవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీలలు మాట్లాడుతూ వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆనంద నిలయంలో ప్రజల కోసం ఎన్నో సకల సౌకర్యాలు కల్పించనున్నామని అన్నారు. 29.3 ఎకరాలలో 11టవర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 3576 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.

వీటితో పాటు పిల్లకోసం ఆట స్థలం, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికె ట్‌ గ్రౌండ్, జిమ్‌ వంటి సౌకర్యాలు ఉంటయన్నారు. దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ అయిన ఆనంద నిలయంలో అతి తక్కువ ధరకే ప్రజలకు ఫ్లాట్లను అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, టూరిజం డవపల్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రాంమోహన్, సంస్థ డైరెక్టర్లు ఎర్రం వైష్ణవి, ఎర్రం వనిత, దివ్య, సౌమ్య, రాజేశ్‌, అభిషేక్‌ చంద్రత తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)