Breaking News

అలాంటివి చేసుంటే పెద్ద స్టార్‌ అయ్యేవాడిని.. నేనే వదిలేశా!: సిద్దార్థ్‌

Published on Fri, 01/31/2025 - 12:59

సిద్దార్థ్‌.. ఒకప్పుడు తెలుగులో టాప్‌ హీరో.. కానీ ఆ క్రేజ్‌ను అలాగే కాపాడుకోలేకోయాడు. బాయ్స్‌, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, .. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇటీవలి కాలంలో కోలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నాడు. అయితే తన కెరీర్‌లో కొన్ని పనులు చేయకపోవడం వల్లే స్టార్‌ కాలేకపోయానంటున్నాడు.

అలాంటివి రిజెక్ట్‌ చేశా..
ఇటీవల హైదరాబాద్‌ సాహిత్య వేడుకకు హాజరైన హీరో సిద్ధార్థ్‌ (Siddharth) సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా దగ్గరికి చాలారకాల స్క్రిప్టులు వచ్చేవి. అమ్మాయిలను కొట్టడం, ఐటం సాంగ్స్‌ చేయడం, నడుము గిల్లడం.. నేను చెప్పినట్లుగా అమ్మాయిలు నడుచుకోవడం.. ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలన్నది నేనే ఆదేశాలివ్వడం.. ఇలాంటి కంటెంట్‌తో కొన్ని కథలు వచ్చాయి. వాటిని నేను రిజెక్ట్‌ చేశాను. బహుశా అవి ఒప్పుకుని ఉంటే ఈరోజు నేను పెద్ద స్టార్‌ అయ్యుండేవాడినేమో! కానీ నేను నా మనసుకు నచ్చినవే చేసుకుంటూ పోయాను.

ఆ సంతోషాన్ని, అభిమానాన్ని వెలకట్టలేం
చాలామంది నా దగ్గరకు వచ్చి మీరు ఆడవాళ్లకు చాలా గౌరవం ఇస్తారని చెప్తూ ఉంటారు. మహిళలకే కాదు, పేరెంట్స్‌కు, పిల్లలకు.. ఇలా అందరికీ గౌరవప్రాధాన్యతలిస్తారని అంటుంటారు. అంతేకాదు వారి పిల్లలు పదిహేనేళ్లుగా నా సినిమాలు చూస్తున్నారని చెప్తుంటారు. ఇంతకంటే సంతోషకరమైనది ఇంకేముంటుంది? ఈ అభిమానానికి కోట్లల్లో కూడా వెలగట్టలేం. చాలామంది హీరోలు యాక్షన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మగవాళ్లు బాధను బయటకు చూపించకూడదన్నట్లుగా ఉంటున్నారు. కానీ నేనలా కాదు.. ‍స్క్రీన్‌పై ఏడవడాన్ని కూడా సంతోషంగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.

(చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ)

చేసిందంతా చేసి సుద్దపూసలా..
అయితే ఈయన మాటలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆట (Aata Movie), గృహం సినిమా (Gruham Movie)లో నువ్వు చేసిందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. చేసిందంతా చేసి ఇలాంటి నీతులు చెప్పడం అవసరమా? అని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరేమో.. ఈ మార్పు ఎప్పుడు మొదలైందో చెప్పుంటే బాగుండేది.. ఎందుకంటే గతంలో సిద్దార్థ్‌ కూడా హీరోయిన్స్‌తో హద్దుమీరి రొమాన్స్‌ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక బుద్ధి వచ్చినట్లుంది.. అందుకే ఈ మార్పు అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమా
సిద్దార్థ్‌ సినిమాల విషయానికి వస్తే.. 2023లో చిత్తా (చిన్నా) సినిమాతో హీరోగా, నిర్మాతగా విజయం అందుకున్నాడు ఈయన చివరగా ఇండియన్‌ 2, మిస్‌ యు మూవీలో యాక్ట్‌ చేశాడు. త్వరలోనే ఇండియన్‌ 3, టెస్ట్‌ చిత్రంలో భాగం కానున్నాడు. పర్సనల్‌ లైఫ్‌ విషయానికి వస్తే హీరోయిన్‌ అదితిరావు హైదరిని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 

ఇద్దరికీ రెండో పెళ్లి
తెలంగాణలోని వనపర్తిలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయంలో వీరి వివాహం జరిగింది.  తర్వాత రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. వీరికిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం! ఇకపోతే వీరిద్దరికీ మహాసముద్రం సినిమా సమయంలో పరిచయం, స్నేహం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. దాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లారు.

చదవండి: 19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)