Breaking News

ఓటీటీలో 'సిద్ధార్థ్‌ ' సినిమా.. అఫీషియల్‌ ప్రకటన

Published on Tue, 07/29/2025 - 13:08

సిద్ధార్థ్‌ హీరోగా నటించిన కొత్త సినిమా '3BHK' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీగణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో బాగా ఆకర్షించింది. కథ కాస్త నెమ్మదిగా రన్‌ అవుతుందని విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, శరత్‌కుమార్‌, దేవయాని, మీతా రంగనాథ్‌, చైత్ర, యోగిబాబు తదితరులు‌ నటించారు.

థియేటర్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న '3 బీహెచ్‌కే'.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగష్టు 1 నుంచి సింప్లీ సౌత్‌(Simply South) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని ప్రకటన వచ్చేసింది. తమిళ్‌, తెలుగులో విడుదల కానుంది. కానీ, భారత్‌లో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చూసే ఛాన్స్‌ లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉన్నవారికి మాత్రమే ఆ అవకాశం ఉంది. అయితే, అదేరోజున అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం భారత్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. ఒకవేళ ఆ తేదీన రాకుంటే.. ఆగష్టు 8న తప్పకుండా విడుదల కావచ్చని టాక్‌ ఉంది.

నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. కథ కాస్త నెమ్మదిగా సాగినా.. సినిమా అందరికీ నచ్చుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)