Breaking News

తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి

Published on Sat, 04/26/2025 - 18:17

బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు.. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తలకిందులైనప్పుడు చాలామంది ఆ బంధాన్ని కష్టంగా కొనసాగించడానికి బదులు తెంపుకోవడానికే ప్రయత్నిస్తారు. బుల్లితెర నటి శుభంగి ఆత్రే (Shubhangi Atre) కూడా అదే పని చేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థమయ్యాక భర్త పీయూశ్‌ పూరే (Piyush Poorey)తో విడాకులు ఇచ్చేసింది. ఇంతలోనే పీయూశ్‌ పూరే (ఏప్రిల్‌ 19న ) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.

విడాకులకు కారణం..
ఈ క్రమంలో శుభంగి.. తమ అన్యోన్య దాంపత్యం చెల్లాచెదురవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నేను టీవీ ఇండస్ట్రీలో సక్సెస్‌ అయ్యాను కాబట్టి భర్తను వదిలేశాను అని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అతడికున్న తాగుడు వ్యసనం వల్లే విడిపోవాల్సి వచ్చింది. మందుకు బానిసవడం వల్ల అది కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

ఎంతో ప్రయత్నించా..
మా బంధాన్ని కాపాడుకోవాలని చాలారకాలుగా ప్రయత్నించాను. కానీ పరిస్థితులు చేయిదాటిపోయాయి. అతడితో మందు మాన్పించేందుకు రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు కూడా పంపించాను. అయినా తనలో మార్పు రాలేదు. ఇరు కుటుంబాలు తనను మార్చాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యసనం.. అతడిని నాశనం చేసింది. మాపై కూడా ప్రభావం చూపింది.

ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు
విడాకులు ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. 2018-2019 సమయంలో ఆ ఆలోచన మొదలైంది. చివరకు ఈ ఏడాది విడాకులు తీసుకున్నాం. డివోర్స్‌ అయ్యాక కూడా నేను అతడితో టచ్‌లోనే ఉన్నాను. ఇంతలోనే అతడు కాలం చేశాడు. త్వరలోనే నేను, నా కూతురు.. ఇండోర్‌లో ఉన్న పీయూశ్‌ కుటుంబాన్ని కలుస్తాం అని చెప్పుకొచ్చింది.

సీరియల్స్‌తో ఫేమస్‌
శుభంగి ఆత్రే- పీయూశ్‌ 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కూతురు పుట్టింది. 2022 నుంచి దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కాగా శుభంగి ఆత్రే 2006లో కసౌజీ జిందగీకే సీరియల్‌తో నటప్రయాణం ఆరంభించింది. కస్తూరి, బాబ్జీ ఘర్‌ పర్‌ హైర్‌, హవన్‌ వంటి పలు సీరియల్స్‌ చేసింది. 

చదవండి: పాకిస్తాన్‌కు ఎప్పుడు వస్తున్నావ్‌? దద్దమ్మ అంటూ సింగర్‌ కౌంటర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)