శ్రుతీహాసన్‌ షాకింగ్‌ నిర్ణయం.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Published on Tue, 07/08/2025 - 17:49

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్‌(Shruti Haasan) ఒకరు. సినిమా అప్‌డేట్స్‌తో పాటు తన పర్సనల్‌ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచు ఫోటోషూట్‌ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఇన్‌స్టాలో ఆమెకు 24 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారంటే..ఆమె నెట్టింట ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్‌కి తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తన అకౌంట్‌‌ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతీహాసన్‌ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్‌ కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 14న విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)