Breaking News

పెళ్లి చేసుకోను సార్‌

Published on Fri, 07/05/2024 - 04:50

అమ్మాయిలను వారి పెళ్లి గురించి అడగడం మానుకోండి అంటున్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఇంతకీ విషయం ఏంటంటే.. వీలైనప్పుడల్లా సోషల్‌ మీడియా మాధ్యమాల్లో నెటిజన్లతో చాట్‌ సెషన్‌ నిర్వహించడం శ్రుతీహాసన్‌కు అలవాటు. ఇటీవల మరోసారి ఈ బ్యూటీ చాట్‌ సెషన్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా... ‘మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్‌ అడిగితే శ్రుతీహాసన్‌ కాస్త గట్టిగానే బదులిచ్చారు.

‘‘ఇది 2024... అమ్మాయిలను ఇలాంటి ఉపయోగం లేని వెర్రి ప్రశ్నలు అడగడం మానుకోండి’’ అంటూ బదులిచ్చారామె. అలాగే ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడమ్‌’ అని మరో నెటిజన్‌ శ్రుతీహాసన్‌ను ప్రశ్నించగా... ‘ఐ వోన్ట్‌ సార్‌’ (చేసుకోను సార్‌) అని బదులిచ్చారు. అంటే... పెళ్లి చేసుకోనని సూటిగా చెప్పేశారు. ఇక సినిమాల విషయానికొస్తే... అడివి శేష్‌తో ‘డెకాయిట్‌’ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రభాస్‌తో ‘సలార్‌ 2’, తమిళంలో ‘చెన్నై స్టోరీ’ సినిమాలు కూడా శ్రుతి చేతిలో ఉన్నాయి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)