Breaking News

కూలీ పాత్ర అన్యాయంగా అనిపించలేదా?.. శృతిహాసన్‌ రిప్లై ఇదే!

Published on Sun, 08/24/2025 - 13:07

కోలీవుడ్ భామ శృతిహాసన్ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకులను అలరించింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో శృతిహాసన్ నటించింది. ఈ మూవీలో టాలీవడ్ హీరో నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రల్లో మెప్పించారు.

అయితే తాజాగా ఓ నెటిజన్‌ శృతి హాసన్‌ పాత్రపై ఆమెను ప్రశ్నించాడు. ఆస్క్ మీ సమ్‌థింగ్‌ అంటూ శృతిహాసన్ సోషల్ మీడియాలో చాట్ నిర్వహించింది. ఇది చూసిన ఓ నెటిజన్.. ఆపదలో ఉన్న అమ్మాయిగా ప్రీతి పాత్రను అలా చిత్రీకరించడం మీకు అన్యాయంగా అనిపించలేదా? అని అడిగాడు. దీనికి శృతిహాసన్ కూడా రిప్లై ఇచ్చారు.

ఇక్కడ ఆమె బాధలో ఉంది.. కానీ అది మరొకరి విజన్.. ఇక్కడ మీరు చూడాల్సింది న్యాయమా? అన్యాయమా కాదు?.. ఆ పాత్రను మాత్రమే అంటూ సమాధానమిచ్చింది. ఇదంతా దర్శకుడి దృష్టి కోణానికి సంబంధించినది అని అన్నారు. గత ఇంటర్వ్యూలో ప్రీతి పాత్ర గురించి శృతిహాసన్ మాట్లాడింది. తన పాత్ర చాలా భిన్నంగా ఉండడంతో పాటు లోతుగా సంబంధం కలిగి ఉందని అభివర్ణించింది. ప్రీతి పాత్ర మహిళలందరికీ నచ్చుతుందని.. ఆ పాత్ర గురించి నాకు నిజంగా నచ్చింది అదేనని తెలిపింది. ఆమె పాత్రలోని కొన్ని అంశాలతో తాను కనెక్ట్ అయ్యానని వెల్లడించింది. ప్రీతి చాలా బాధ్యతాయుతంగా, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొంది.

s

కాగా.. లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)