Breaking News

రాజకీయాల్లోకి స్టార్ హీరో కూతురు.. క్లారిటీ ఇదే!

Published on Thu, 10/19/2023 - 08:19

సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్.‌ ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శృతిహాసన్. తరచుగా సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే శృతి..  ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కోలీవుడ్ స్టార్, మక్కల్‌ ఇయక్కం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ వారసురాలు కావడంతో ఆమె రాజకీయ రంగప్రవేశం గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

(ఇది చదవండి: ‘భగవంత్‌ కేసరి’ మూవీ ట్విటర్‌ రివ్యూ)

ఈ విషయమై శ్రుతిహాసన్‌ ఇప్పటికే చాలా స్పష్టంగా సమాధానం చెబుతూనే వచ్చింది శృతి. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటించగా... ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు అదే ప్రశ్న ఎదురైంది. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడంపైనే  తనకు ఆసక్తి ఉందని చెప్పారు. 

కాగా..  ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న భామ.. ప్రభాస్‌ సరసన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని తెలిపారు. అయితే పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే విధంగా తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్‌ ఆల్బమ్‌ను కూడా రూపొందిస్తున్నట్లు.. దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రుతిహాసన్‌ చెప్పారు.

(ఇది చదవండి: హీరోయిన్‌గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)