Breaking News

ఈ సినిమా నాకెంతో స్పెషల్‌: శృతి హాసన్‌

Published on Fri, 10/06/2023 - 11:02

చేతిలో ఉన్నది తక్కువ చిత్రాలే అయినా ఆమె చేతిలో ఉన్నవన్నీ గన్‌ లాంటి చిత్రాలే.. అందుకే పాన్‌ ఇండియా కాదు పాన్‌ వరల్డ్‌ నటి అయ్యారు శ్రుతిహాసన్‌. ఈ బ్యూటీకి సంబంధించిన వార్తలెప్పుడూ కొత్తగా, ఆసక్తికరంగా ఉంటాయి. కాగా ప్రస్తుతం శ్రుతిహాసన్‌ ప్రభాస్‌కు జంటగా నటించిన సలార్‌ చిత్రం విడుదల తేదీ వెల్లడైంది. డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సలార్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇక నాని కథానాయకుడిగా నటిస్తున్న హాయ్‌ నాన్న చిత్రంలో శ్రుతి హాసన్‌ ముఖ్య భూమికను పోషిస్తున్నట్లు సమాచారం. ఆమె నటిస్తున్న మరో హాలీవుడ్‌ చిత్రం ది ఐ. ఈ చిత్రమే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఈ హాలీవుడ్‌ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డుల కేటగిరీల్లో నామినేట్‌ కావడం విశేషం. ది లాస్ట్‌ కింగ్‌డమ్‌ చిత్రం ఫేమ్‌ మార్క్‌ రౌళి కథానాయకుడిగా నటించిన ఇందులో ఆయనకు జంటగా శ్రుతిహాసన్‌ నటించారు.

పర్యాటక పరిరక్షణ ఇతివృత్తంతో రూపొందిన ది ఐ చిత్రం లండన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైందని శ్రుతి ట్విటర్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా గ్రీక్‌ అంతర్జాతీయ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శింపబడడంతో పాటు అవార్డుల కేటగిరీలో నామినేట్‌ అయిందని తెలిపారు. అలాంటి చిత్రంలో తాను నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రం తన కెరీర్లో ప్రత్యేకమన్నారు. ఈచిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శ్రుతిహాసన్‌ పేర్కొన్నారు.

చదవండి: బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇస్తున్న శివాజీ.. ఇష్టం లేకపోయినా త్యాగం చేసిన శుభశ్రీ, అతడివల్లే!

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)