Breaking News

శృతి హాసన్‌ టు పూజ హెగ్డే... ‘స్పెషల్‌’ స్పెషలిస్ట్‌గా సీనియర్‌ భామలు

Published on Sun, 05/24/2026 - 11:46

ఒకప్పుడు కేవలం ఐటెమ్ సాంగ్స్ కోసమే ప్రత్యేకంగా కొందరు డ్యాన్సర్లు ఉండేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్, నార్త్ సినిమాలలో సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌కు ‘కేరాఫ్’గా నిలుస్తున్నారు. వరుస అవకాశాలతో బిజీగా ఉంటూనే, కేవలం మూడు నాలుగు నిమిషాల పాటతో సినిమా స్థాయిని మార్చేయగల సత్తా ఈ సీనియర్ హీరోయిన్లకు ఉంది. అందుకే నిర్మాతలు సైతం కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ఈ భామలను స్పెషల్ సాంగ్స్ కోసం ఎంచుకుంటున్నారు.

‘పెద్ది’ హాసన్‌ మాస్ స్టెప్పులు
టాలెంట్, గ్లామర్ కలబోసిన శృతి హాసన్ ఇటు మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూనే, అటు స్పెషల్ సాంగ్స్‌లోనూ అదరగొడుతోంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు  కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పెద్ది’ చిత్రంలో శృతి హాసన్  ప్రత్యేక పాటకు రామ్‌ చరణ్‌తో కాలు కదిపింది. గతంలో మహేశ్‌ బాబు ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్ లో..’ అంటూ మాస్ స్టెప్పులేసిన శృతి, ఇప్పుడు చరణ్‌తో స్టెప్పులేయబోతుంది. నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ ఓ స్పెషల్ అప్పియరెన్స్‌తో ప్రేక్షకులను అలరించింది.

‘స్పెషల్ సాంగ్స్’ స్పెషలిస్ట్‌గా తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చుట్టూనే తిరుగుతోంది. కేవలం పాట కోసమే థియేటర్లకు వచ్చేలా చేయగల క్రేజ్ తమన్నా సొంతం. జై లవకుశ: ‘స్వింగ్ జరా..’ అంటూ ఎన్టీఆర్‌తో పోటీపడి డ్యాన్స్ చేసింది. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేశ్‌ బాబుతో కలిసి ‘డాంగ్ డాంగ్..’ అంటూ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో దుమ్మురేపింది. రజనీకాంత్ ‘జైలర్’లో ‘కావాలయ్యా..’ పాట దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే హిందీ మూవీ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ అంటూ బాలీవుడ్‌ను కూడా షేక్ చేసింది.

ఒక్కసారే..రికార్డులు బ్రేక్‌
స్టార్ హీరోయిన్ సమంత  కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచే స్పెషల్ సాంగ్ ‘పుష్ప: ద రైజ్’ లోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’. అల్లు అర్జున్ సరసన సమంత చేసిన ఈ ఊరమాస్ సాంగ్ కేవలం టాలీవుడ్‌లోనే కాదు, అంతర్జాతీయంగా ట్రెండ్ అయింది. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో రికార్డులు సృష్టించింది.  సమంత గ్లామర్, ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

‘మొనికా’ హంగామా
బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో ‘మొనికా..’ అనే స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు, గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.  అంతకు ముందు రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ‘జిగేల్‌ రాణి’గా పూజ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్‌తో మెరిసింది. వీళ్లు మాత్రమే కాదు.. శ్రీలీల, మృణాల్‌తో పాటు మరికొంత మంది యంగ్‌ హీరోయిన్లు కూడా స్పెషల్‌ సాంగ్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.

 

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)

+5

రామ్‌చరణ్‌ 'పెద్ది కీ ఆవాజ్‌' ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)

+5

కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)