Breaking News

రావణుడిపై ప్రేమతో పచ్చబొట్టు వేయించుకున్న బుల్లితెర నటుడు

Published on Wed, 08/21/2024 - 18:44

కొందరికి కొన్నిరకాల పాత్రలు పెద్దగా నప్పవు. అందులోనూ పౌరాణిక పాత్రలు అందరికీ అంతగా సెట్టవవు. కొద్దిమందికి మాత్రమే పర్ఫెక్ట్‌గా సూటవుతాయి. అందులో ఒకరే బుల్లితెర నటుడు నికితిన్‌ ధీర్‌. శ్రీమద్‌ రామాయణ్‌ సీరియల్‌లో ఇతడు రావణుడిగా ఆకట్టుకుంటున్నాడు. కేవలం పేపర్‌పై ఉన్న డైలాగులు బట్టీపట్టి చెప్పడం లేదు. ఆ పాత్రను అర్థం చేసుకున్నాడు. రావణుడిని లోతుగా చదివి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడు.

కుడికాలిపై టాటూ
శివభక్తుడిగా, రావణుడిగా అలరిస్తున్న నికితిన్‌ తాజాగా తన కుడికాలిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎన్నో అనుభవాలకు నిలువుటద్దమే జీవితం. మనకు నిజమైన సంపద శరీరమే! పురాతన కాలం నుంచి సనాతన ప్రజలు పచ్చబొట్లను నమ్మేవారు. మనం చనిపోయాక కూడా అవి మనతోనే ఉన్నాయంటారు. టాటూ అనేది చెరగని ముద్రవంటిది.

9 నెలలుగా..
రావణుడి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మహాదేవుడికి కృతజ్ఞతలు. 9 నెలలుగా ఈ పాత్రలో జీవిస్తూ తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తనలాంటి(రావణుడి వంటి) రాజు మరొకరు ఉండరని తనకూ తెలుసు. తనలాంటి రాక్షసుడు ఇంకెవరూ లేరని కూడా తెలుసు. తనలాంటి నిష్ట బ్రాహ్మణుడు కూడా ఎవరూ ఉండరని ఎరుక.

నా లైఫ్‌లోకి వచ్చినందుకు..
తను వీణ వాయిస్తే ఆ సంగీతం వినేందుకు దేవతలు దిగి వస్తారు. ఆయన చంద్రహాస ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు అదే దేవతలు భయంతో దాక్కుంటారు. అలాంటి నువ్వు నా జీవితంలోకి చ్చినందుకు థ్యాంక్స్‌ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వీణ, చంద్రహాస ఖడ్గాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)