Breaking News

బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!

Published on Thu, 08/29/2024 - 11:36

బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్‌ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ మరో మైలురాయిని దాటేసింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్‌ దేశవ్యాప్తంగా సాధించిన నెట్‌ వసూళ్లను అధిగమించింది.

'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది. గతంలో రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' దేశీయంగా రూ. 421 కోట్లు నెట్ కలెక్షన్స్‌ వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మళ్లీ థియేటర్‌లకు రప్పించడంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారు.

ఇదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది స్త్రీ-2. బాలీవుడ్‌లో 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) లైఫ్‌ టైమ్‌ వసూళ్లను అధిగమించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. మూడో వారాంతం నాటికి ఇండియాలో రూ. 500 కోట్ల నికర స్థాయిని అధిగమిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే షారూఖ్‌ ఖాన్‌ చిత్రం జవాన్ సాధించిన రూ.640 కోట్ల నికర వసూళ్లను అధిగమించడం స్త్రీ-2 చిత్రానికి సవాల్‌గా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత జోరు చూస్తుంటే స్త్రీ 2'కి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)