Breaking News

ఫ్రెండ్‌ పెళ్లిలో చిందేసిన బాలీవుడ్‌ బ్యూటీ.. మరి నీ పెళ్లెప్పుడో?

Published on Fri, 01/19/2024 - 18:56

ఇప్పటి పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరగడం లేదు. హల్దీ, సంగీత్‌, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. ఇలా రకరకాల పేర్లు, ఈవెంట్లతో ధూమ్‌ధామ్‌గా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల పెళ్లిళ్లయితే చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీల దగ్గర పనిచేసేవారు కూడా బాగానే సంపాదిస్తూ అంతే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ దగ్గర పనిచేసే ఆమె హెయిర్‌ స్టైలిస్ట్‌ నిఖితా మీనన్‌ పెళ్లి పీటలెక్కింది. గోవాలో ఆమె పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఎనర్జీ డ్యాన్స్‌
ఈ క్రమంలో అక్కడ పెళ్లికూతురితో పాటు తన ఫ్రెండ్స్‌తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేసింది శ్రద్ధా కపూర్‌. పింక్‌, ఆరెంజ్‌ కలర్‌ లెహంగా ధరించిన ఈ బ్యూటీ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రద్ధా ఎంత సంతోషంగా, హుషారుగా డ్యాన్స్‌ చేస్తుందో.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.. మరి నువ్వెప్పుడు ముహూర్తం పెట్టించుకుంటావ్‌? అని కామెంట్లు చేస్తున్నారు.

సాహోతో తెలుగులో పరిచయం
కాగా గతంలో స్త్రీ(2018) సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న శ్రద్ధా కపూర్‌ ఇప్పుడు దాని సీక్వెల్‌లో నటిస్తోంది. రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే సాహో సినిమాతో ఈ బ్యూటీ తెలుగువారికీ దగ్గరైంది.

చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు!

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)