Breaking News

చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్‌బీ..

Published on Sun, 06/08/2025 - 12:46

మలయాళ సీనియర్‌ హీరోయిన్‌ శోభన (Shobana) 'కల్కి 2898 ఏడీ' సినిమా (Kalki 2898 AD Movie)తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్‌ సినిమాలోనూ యాక్ట్‌ చేసింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.

అమితాబ్‌తో పాట షూటింగ్‌
బచ్చన్‌ సర్‌ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్‌ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్‌ (Amitabh Bachchan) సర్‌ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్‌లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్‌లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్‌ సర్‌ దగ్గర కారవాన్‌ ఉంది. కానీ చాలామంది షూట్‌ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.

చెట్టు వెనకాల..
నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్‌ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్‌ చేశారు. బచ్చన్‌ సర్‌ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్‌లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.

కల్కి 2898 ఏడీలో..
కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్‌ (హెవీ మేకప్‌) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించాడు. అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్‌ హాసన్‌ యాస్కిన్‌గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో పట్టాలెక్కనుంది. 

చదవండి: ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్‌

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు