Breaking News

థియేటర్, ఓటీటీ తేడా చూడను.. కథ, నా పాత్ర నచ్చితే చాలు : శివానీ నాగారం

Published on Wed, 09/03/2025 - 10:24

‘‘లిటిల్‌ హార్ట్స్‌’ చిత్రంలో కాత్యాయని అనే కాలేజ్‌ గర్ల్‌గా చేశాను. ప్రేక్షకులు తమని తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమాలోని అఖిల్‌ (మౌళి తనుజ్‌ పాత్ర), కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే కళాశాల రోజులు, అలాగే విద్యార్థిగా మనం చేసిన పనులన్నీ గుర్తొస్తాయి... మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది’’ అని శివానీ నాగారం తెలిపారు. 

మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఆదిత్య హాసన్‌ నిర్మించిన ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ నాగారం మాట్లాడుతూ– ‘‘లిటిల్‌ హార్ట్స్‌’ సంగీత దర్శకుడు సింజిత్‌ యెర్రమల్లి, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. తన ద్వారా ఈ ప్రాజెక్ట్‌ నా దగ్గరకు వచ్చింది. సాయి మార్తాండ్‌ కథ, నా పాత్ర చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మంచి కంటెంట్‌ ఉన్న మూవీ ‘లిటిల్‌ హార్ట్స్‌’. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది.

 మా సినిమా కంటెంట్‌ నచ్చడంతో ‘బన్నీ’ వాసు, వంశీ నందిపాటిగార్లు రిలీజ్‌ చేస్తున్నారు. దాంతో మా సినిమా ఓవర్సీస్‌లోనూ విడుదలవుతోంది. ఇక థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడను. కథ, నా పాత్ర నచ్చితే వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తాను. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నేను, సుహాస్‌ కలిసి ‘హే భగవాన్‌’ సినిమా చేస్తున్నాం. మరో రెండు చిత్రాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.   

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)